మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మద్యం మత్తులో కిరణ్ అనే వ్యక్తికి చెందిన మామిడి తోటలోని గుడిసెకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో గుడిసెలోని మోటారు, కరెంట్ వైరు కాలిపోయి సుమారు రూ. 50 వేల నష్టం వాటిల్లిందని బాధితుడు పేర్కొన్నాడు. దుండగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.