మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన జ్యువెలరీ వ్యాపారి దురుసోజు పూర్ణచారి (54) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. వ్యక్తిగత పనిపై వెళ్తూ ద్విచక్రవాహనంపై నుంచి కింద పడటంతో స్థానికులు తొర్రూర్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పూర్ణచారికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.