మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గుర్రాలకుంట తండాలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. స్థానిక తండా ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం. తండాకు చెందిన భార్యభర్తలు బానోత్ కిషన్-కమల ఇంటి మీదకు అదే తండాకు చెందిన ముగ్గురు వ్యక్తులు రాళ్లతో, కర్రలతో, గొడ్డలితో దాడి చేశారన్నారు. ఈ దాడిలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాలి.