డోర్నకల్: బెల్టు షాపు నిర్వాహకురాలిపై దాడి

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న సిలువేరు నాగమణి అనే మహిళపై గురువారం ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. ప్రక్క మండలంలో మద్యం అమ్ముతున్నారని గ్రామ ఉపసర్పంచ్ నరసింహారావు, వైన్ షాప్ సిబ్బంది సాయి, నాగు తనపై విచక్షణారహితంగా దాడి చేశారని బాధితురాలు ఆరోపించారు. ఈ ఘటనపై నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్