డోర్నకల్ బస్టాండ్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఎ మండల అధ్యక్షుడు వీరేందర్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా విద్యాశాఖకు 10 శాతం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎ నాయకులు వంశీ, రజిత, సుజాత , కళ్యాణి, ఆకాష్, యాకన్న సురేష్, ప్రవీణ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.