మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో గురువారం సర్పంచి కళావతి జగదీష్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు వీటిని అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచి పేదల వైద్యానికి భరోసా కల్పిస్తోందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి రాము, ఉపసర్పంచి మౌనిక, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.