ఓ యువకుడు మద్యానికి బానిసై కామెర్లతో మృతి చెందిన ఘటన డోర్నకల్ మండలంలో ముల్కలపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పేరెల్లి రాజారాం(గురు) అనారోగ్యంతో బాధపడుతూ.. మద్యానికి బానిసై సరిగా పత్యం చేయక మృతి చెందినట్లు వారు తెలిపారు. దీనితో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.