హనుమకొండ 61వ డివిజన్ పరిధిలోని చైతన్యపురి కాలనీలో స్థానిక ప్రజలు నిర్మించుకుంటున్న పోచమ్మ తల్లి ఆలయానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. కొబ్బరికాయ కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ ఆలయ నిర్మాణం ప్రాంతీయ ఆధ్యాత్మికాభివృద్ధికి దోహదపడుతుందని, కాలనీ అభివృద్ధికి, ప్రజల అవసరాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.