మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామంలో ప్రైవేటు పాఠశాల బస్సులను ప్రభుత్వ ఉపాధ్యాయులు సోమవారం అడ్డుకున్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించి ఉచిత విద్య కోసం ఎంతో కృషి చేస్తుందని, ప్రైవేటు విద్యా సంస్థలు ప్రజలను మభ్య పెడుతూ ప్రభుత్వ విద్యను విద్యార్థులకు అందకుండా చేస్తున్నాయని వారు ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులకు సహకరించి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలని కోరారు.