మహబూబాబాద్ జిల్లా బలపాల గ్రామంలోని బాలుర వసతి గృహంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏఐఎస్ఎఫ్ కురవి మండల సెక్రెటరీ సాయికుమార్, నాయకుడు ప్రకాశ్ అన్నారు. ఈ సందర్భంగా వసతి గృహాన్ని శనివారం ఆయన సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ వసతి గృహంలోని పైకప్పు ఊడి విద్యార్థుల మీద ఎప్పుడు పడుతుందో తెలియకుండా ఉందన్నారు. విద్యార్థులకు సరైన నీటి సౌకర్యం లేదని, అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.