కురవి: డబ్బులు పంచితే డయల్ 100 కాల్ చేయండి: SP

గ్రామపంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మహబుబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ కంబాలపల్లి, కురవి గ్రామాలను సందర్శించారు. ఎక్కడైనా డబ్బులు పంచుతున్నారని సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100కి ఫోన్ చేయాలని ఆయన సూచించారు. కురవిలో ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించి, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంటుందని కూడా ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్