మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో జరిగిన అత్యాచారం, కిడ్నాప్ కేసులో బుధవారం నవీన్ అనే యువకుడికి 11 సంవత్సరాల కఠిన జైలు శిక్ష, 21 రూపాయల జరిమానా విధిస్తూ మహబూబాబాద్ ప్రిన్సిపల్ డిస్టిక్ అండ్ స్పెషల్ జడ్జి అబ్దుల్ రఫీ తీర్పు చెప్పారు. ఈ తీర్పు బాధితులకు న్యాయం జరిగినట్లుగా భావిస్తున్నారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడటంతో జిల్లాలో న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది.