పేదల పక్షాన పోరాడే పోగుల శ్రీను లాంటి కమ్యూనిస్టులు భౌతికంగా మన మధ్య లేకున్నా ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలుస్తారని గీతాపనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని రాజోలు గ్రామంలో ఆదివారం పోగుల శ్రీనివాస్ గౌడ్ సంతాప సభ నిర్వహించారు. గౌడల పక్షాన వారి హక్కుల కోసం నిరంతరం పోరాటాలు జరిపిన గొప్ప నాయకుడని కొనియాడారు.