మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ మరియు జ్యోతిబాపూలే పాఠశాలను గురువారం అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్ రూమ్, కిచెన్ టాయిలెట్స్ స్టడీ రూమ్స్ పరిసరాలను పరిశీలించారు మెనూ ప్రకారం భోజనం అందించాలని సంబంధిత వెల్ఫేర్ ఆఫీసర్లను ఆదేశించారు. రాత్రి సమయాలలో విద్యుత్ అంతరాయం రాకుండా చూడాలని అన్నారు.