మరిపెడ: భూభారతి చట్టం పై అవగాహన కార్యక్రమం

తెలంగాణ భూభారతి చట్టం -2025పై అవాహన సదస్సు గురువారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ, మరిపెడ మండల కేంద్రం రైతు వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. వీరబ్రహ్మచారి, రెవెన్యూ డివిజన్ అధికారి గణేష్, స్థానిక తహసిల్దార్ సైదులు, తదితరులు పాల్గొన్నారు. సదస్సుకు హాజరైన రైతులకు భూ భారతి చట్టంపై  అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్