డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ మండల కేంద్రంలో డిగ్రీ విద్యార్థులకు ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేయాలని పీడీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోనగిరి మధు పేర్కొన్నారు. ఈ మేరకు ఎగ్జామినేషన్ అసిస్టెంట్ కంట్రోలర్ తిరుమల దేవికి బుధవారం వినతి పత్రం అందించారు. ఇందులో సంఘం జిల్లా అధ్యక్షుడు మాదారపు నాగరాజు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహేశ్, మరిపెడ మండల నాయకులు శ్యామ్, రాజేశ్ తదితర నాయకులు పాల్గొన్నారు.