మరిపెడ: మానవత్వం చాటుకున్న మరిపెడ ఎస్సై సతీష్

మరిపెడ మండలం బోట్య తండాకు చెందిన ధరంసోత్ నవీన్ వంటలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పనికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా మతిస్థిమితం సరిగా లేక బయటికి వెళ్లి పని చేయలేని పరిస్థితి. కేసు దర్యాప్తులో భాగంగా ఇంటికి వెళ్లిన మరిపెడ ఎస్సై బొలగాని సతీష్ కుమార్ సహాయంగా రూ. 5000 నవీన్ కుటుంబానికి అందించారు.

సంబంధిత పోస్ట్