మరిపెడ: విద్యుత్తు తీగలు తగిలి వరిగడ్డి దగ్ధం

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎడిజర్ల శివారులో శనివారం వరి గడ్డి తరలిస్తున్న ట్రాక్టర్‌కు విద్యుత్ తీగలు తగలడంతో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గుగులోత్ వీరన్న అనే రైతుకు చెందిన ట్రాక్టర్ ట్రాలీతో పాటు వరి గడ్డి దగ్ధమై సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చి ఇతర పొలాలకు వ్యాప్తి చెందకుండా నివారించారు.

సంబంధిత పోస్ట్