మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.