పెద్దవంగర: మంటల్లో చిక్కుకొని 7 గొర్రె పిల్లలు మృతి

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో ఆదివారం పంట అవశేషాలకు అంటుకున్న నిప్పు అకస్మాత్తుగా వ్యాపించడంతో ఉడుత లెనిన్ అనే వ్యక్తికి చెందిన ఏడు గొర్రె పిల్లలు సజీవ దహనమయ్యాయి. స్థానికులు, ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్