అమెరికాలోని మిస్సోరిలో ఉద్యోగ రీత్యా నివాసం ఉంటున్న మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల వాసి దారం సుప్రియ (31) ఆదివారం తెల్లవారుజామున (భారత కాలమాన ప్రకారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ట్రక్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో సుప్రియ అక్కడికక్కడే మరణించగా, భారత్ కు చెందిన మరో యువతికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మృతురాలి భర్త కొదుమూరి రంజిత్, అత్తమామలు మహబూబాబాద్ పట్టణంలోని వీరభద్ర అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు.