ట్రాన్స్ ఫార్మర్ వద్ద మంటలతో టేకు చెట్లు దగ్ధం

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బొడ్రాయి తండాకు చెందిన తేజావత్ సాముల్ నాయక్ కు చెందిన మూడు ఎకరాల టేకు తోట విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద చెలరేగిన మంటలతో దగ్ధమైంది. ఈ ఘటనలో 70-80 టేకు చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. 13 ఏళ్లుగా పెంచుకుంటున్న తోట నాశనం కావడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, ట్రాన్స్ఫార్మర్ ను తొలగించమని కోరినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ఈ ప్రమాదంలో సుమారు ఐదు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్