చేపల లారీ బోల్తా.. ఎగబడిన జనం

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో జనాలు చేపల కోసం ఎగబడ్డారు. మంగళవారం ఉదయం ఖమ్మం నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న లారీ మరిపెడ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ఉన్న చేపలు మొత్తం రోడుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో బతికున్న చేపల కోసం ప్రజలు పోటీపడ్డారు. అందినకాడికి చేపలను సంచుల్లో నింపుకొని వెళ్లిపోయారు.

సంబంధిత పోస్ట్