ముప్పై ఎకరాల మొక్కజొన్న పంట దగ్ధం

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తగూడెం రెవెన్యూ పరిధిలో ఆదివారం 30 ఎకరాల మొక్కజొన్న పంట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైంది. రెండు కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించాయి. గాలి ఉధృతితో గ్రామ సమీపానికి చేరిన మంటలను రైతులు ట్రాక్టర్లతో దున్నుతూ, ఫైర్ ఇంజన్ సహాయంతో అదుపులోకి తెచ్చారు. అర్ధరాత్రి వరకు సహాయక చర్యలు కొనసాగాయి.

సంబంధిత పోస్ట్