మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. చలి తీవ్రతతో మరణించినట్లు స్థానికులు భావిస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు మృతదేహాన్ని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.