మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పుల్లం కండు మేఘన, కడియాల భావన అనే ఇద్దరు అమ్మాయిలు అమెరికా కాలిఫోర్నియాలో మూడు రోజుల క్రితం మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను బుధవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య పరామర్శించి, మృతదేహాలను స్వదేశం తీసుకురావడానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.