మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గురప్పా తండాలో శనివారం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. లోవోల్టేజ్ కరెంటు సమస్యతో తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన బానోతు మహేందర్ (33) అనే రైతు, మోటారు కనెక్షన్ మార్చే క్రమంలో విద్యుదాఘాతానికి గురై వ్యవసాయ క్షేత్రంలోనే మృతి చెందాడు. కొన్ని రోజులుగా ట్రాన్స్ ఫార్మర్ లో హెవీ లోడ్, అధిక మోటార్ల వల్ల కరెంటు సరఫరాలో సమస్యలు వస్తున్నాయని, దీంతో పంట ఎండిపోతుందని వేరే ట్రాన్స్ఫార్మర్ కు కలెక్షన్ ఇస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడికి భార్య, ఇద్దరు పిలల్లు ఉన్నారు.