జనగామ జిల్లాలోని 10 పరీక్ష కేంద్రాల్లో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు మొత్తం 104 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి (డీఐఈవో) జితేందర్ రెడ్డి తెలిపారు. ఉదయం జరిగిన జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్స్ లో 71 మంది, మధ్యాహ్నం జరిగిన ప్రాక్టికల్స్ లో 33 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదని ఆయన వెల్లడించారు.