ఆధార్ అడ్రస్ చేంజ్ జనగామ ప్రజల ఇక్కట్లు

జనగామ జిల్లా ప్రజలు ఆధార్ కార్డు అడ్రస్ మార్పులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ఆధార్ కార్డుల్లో పాత జిల్లా పేరు ఉండటంతో సంక్షేమ పథకాలకు అధికారులు వాటిని తిరస్కరిస్తున్నారు. దీంతో ప్రజలు ఆధార్ సెంటర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్రస్ మార్పు కోసం నివాస ధృవీకరణ పత్రాలు అడుగుతున్నారని, దీనితో ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్