జనగామ మండలం గానుగపాడులో ఆదివారం బీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సందీప్ మాట్లాడుతూ బీఆర్ఎస్ విజయానికి గ్రామస్థాయిలో కార్యాచరణ చేపట్టాలని, పార్టీకి ఓటేసేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింత బలపరిచేలా కార్యకర్తలు ముందుకు సాగాలని ఆకాంక్షించారు.