ఇందిరమ్మ ఇల్లు రాలేదని పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం

జనగామ జిల్లా ఎల్లంల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. తన పేరు జాబితాలో లేదని మనస్తాపానికి గురైన బిర్రు రాజు అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గ్రామస్తులు అప్రమత్తమై వెంటనే అతన్ని అడ్డుకుని, నీళ్లు పోసి కాపాడారు. అర్హులైన పేదలకు ఇళ్లు దక్కడం లేదని, ఇళ్ల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, అధికారుల తీరుపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రశ్నలు లేవనెత్తారు.

సంబంధిత పోస్ట్

✕
✕