హనుమకొండ నగరంలోని సర్వే నంబర్ 964, 966, దీన్ దయాల్ నగర్, బంధం చెరువు, కోట చెరువు, ఇందిరమ్మ కాలనీల లో గత అనేక సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్న సుమారు 1000 మంది నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ ప్రతినిధి బృందం శనివారం హైదరాబాదులోని మంత్రి పొంగులేటి నివాసంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కలిసి వినతి పత్రం అందజేశారు. సిపిఐ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సిపిఐ నాయకులు కిషోర్, అలకుంట్ల మల్లన్న, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, జోగుదుర్గ, కనకం కావ్య తదితరులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు.