జనగామ జిల్లా కేంద్రంలోని ోనెహ్రూ పార్క్(హైదరాబాద్ రోడ్డుకు సమీపం) నుంచి స్మశాన వాటిక వరకు 60 ఫీట్ల రోడ్డు నాలుగేళ్లుగా అసంపూర్ణంగా ఉంది. ఇళ్లు, ఫంక్షన్ హాళ్లు కూల్చి ప్రజలు స్థలం ఇచ్చినా మున్సిపల్ అధికారులు పనులు పూర్తి చేయలేదు. దీంతో 15 రోజుల్లో పూర్తి చేయకపోతే దశలవారీగా ఉద్యమం చేస్తామని సీపీఎం హెచ్చరించింది. ఈ కార్య క్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.