జనగామలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఐకెపి కేంద్రంలో ధాన్యం తడిసిపోయింది. బుధవారం, రైతులు కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడానికి వచ్చిన ఆర్డీవోను అడ్డుకుని, వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లారీలను పంపించి, సీరియల్ ప్రకారం కొనుగోలు చేస్తామని ఆర్డీవో హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.