జఫర్గడ్ మండలం తీగరం గ్రామంలోని ఐకేపీ సెంటర్‌లో 30 రోజులుగా రైతుల ధాన్యం ఎండిపోయి, 4-5 లారీలకు పైగా నిల్వ ఉంది. వర్షానికి తడిసి మొలకలు వచ్చి, ధాన్యం ముద్దగా మారుతోంది. ఇప్పటివరకు కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు, గ్రామ పెద్దలు స్పందించి వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని తీగరం రైతులు వేడుకుంటున్నారు.