ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతుల రాస్తారోకొ

జనగామ మండలంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. వడ్లకొండ-గానుగుపహాడ్ బైపాస్ రోడ్డుపై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి రాస్తారోకొ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలకు లారీలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం తరలింపు నిలిచిపోయిందని, తూకం వేసిన వడ్ల బస్తాలు కేంద్రాల్లోనే పేరుకుపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే లారీలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వాలని రైతులు కోరారు.

సంబంధిత పోస్ట్