జనగామ కలెక్టరేట్లో మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలను పాటించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.