మడికొండ ధర్మసాగర్ రోడ్డులోని పరికుంటలో గణేష్ నిమర్జన ఏర్పాట్లపై అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించింది. వరంగల్ మున్సిపాలిటీ కమిషనర్, మడికొండ ఎస్హెచ్ఓ పుల్యాల కిషన్, మున్సిపల్ డీఈలు, విద్యుత్ శాఖ ఏఈ, 64వ డివిజన్ జవాన్లు, డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బైరి లింగమూర్తి గౌడ్, అధ్యక్షుడు దువ్వ శ్రీకాంత్, అరే రమేష్, సిబ్బంది ఈ పరిశీలనలో పాల్గొన్నారు. నిమర్జన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.