పల్లగుట్ట కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఇసురం శ్రీనివాస్ నియామకం

స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని చిల్పూర్ మండలం పల్లగుట్ట కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఇసురం శ్రీనివాస్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనివాస్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ గుట్ట దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు చిర్ర నాగరాజు గౌడ్, గ్రామ సర్పంచ్ ఎనగందుల నర్సింహారెడ్డి, యూత్ అధ్యక్షుడు ఇసురం కృష్ణ, ప్రజా నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్