జనగామ: ఇంటికి ఒక మొక్క నాటాలి: కమిషనర్

జనగామ పట్టణంలో ఇంటింటికి ఒక మొక్కను నాటి సంరక్షించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం పట్టణంలోని 26, 27, 28వ వార్డుల్లో మహిళలకు కమిషనర్ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురపాలక శాఖ ఆధ్వర్యంలో 100 రోజుల కార్యాచరణలో భాగంగా మొక్కలు పంపిణీ చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు.

సంబంధిత పోస్ట్