విద్యార్థులు చదువుతో పాటు వివిధ కళల్లో కూడా రాణించేందుకు వేసవి శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. గురువారం యంగ్ ఇండియా వేసవి శిబిరాలను జనగామ నగరంలోని గణేష్ వాడలోని ప్రాథమికొన్నత పాఠశాల, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.