జనగామ మండలం పెంబర్తి గ్రామం శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు శనివారం సీఐ దామోదర్ రెడ్డి తెలిపారు. పెంబర్తి గ్రామ శివారులో ఎల్లమ్మ గుడి పక్కన ఖాళీ ప్రదేశంలో ఐదుగురు కూర్చుని పేకాట ఆడుతుండగా జనగామ పోలీసులు రైడ్ చేసి వారి నుంచి రూ. 6, 520 నగదు, ఐదు సెల్ ఫోన్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.