జనగామ జిల్లా వ్యాప్తంగా ఇటీవల ఎవ్ఎస్పివి పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో జనగామకు 3వ స్థానం లభించినట్లు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే మన జిల్లా-మన నీరు కార్యక్రమంలో భాగంగా భూగర్భ జలాల మట్టాన్ని పెంపొందించేందుకు జిల్లా వ్యాప్తంగా ఇంకుడు గుంటలు నిర్మిస్తున్నామని అన్నారు. వనమహోత్సవం కింద వేలాది మొక్కలు నాటుతున్నట్లు పేర్కొన్నారు.