జనగామ: పంట పొలాలకు నీరు విడుదల చేయండి

సాగు నీరు లేక నారు మడులు ఎండిపోతున్నాయని జనగామ మండలం చీటకోడూరు గ్రామ రైతులు ఆదివారం అధికారులను కోరారు. వర్షాలు లేక బావులు, బోర్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చీటకోడూరు రిజర్వాయర్ నుంచి యశ్వంతపూర్ వాగుపై నిర్మించిన చెక్ డ్యాంలో నీరు నింపాలని ఫేజ్ 3 చెక్ డ్యాం వద్ద రైతులు నిరసన తెలిపారు. పచ్చగా ఉండాల్సిన పొలాలు బీడువారాయని, కలెక్టర్ స్పందించి నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్