జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం కోటపల్లి గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల ధ్రువీకరణను గురువారం జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం అర్హులందరికీ ఇండ్లు అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.