జనగామ: స్కానింగ్ సెంటర్ లను మూసివేసిన జిల్లా అధికారులు

జనగామ జిల్లా కేంద్రంలోని పలు స్కానింగ్ సెంటర్ లను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా విజయా స్కానింగ్ మరియు డయాగ్నొస్టిక్ సెంటర్ ను గురువారం నుండి 18 వ తేదీ వరకు మూసి వేయడంతో పాటు 50 వేల రూపాయల జరిమాన విధించారు. అలాగే సాయి స్కానింగ్ సెంటర్ తో పాటు సిటి ఐ కేర్ అండ్ ఆప్టికల్స్ ను మూసివేసారు. ఈ తనిఖీల్లో మల్లిఖార్జున్ రావు, రవీందర్ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్