జనగాం యువకుడు నరేష్ ఉత్తరాఖండ్‌లో 113 కి.మీ రన్ పూర్తి

జనగాం జిల్లాకు చెందిన నరేష్, ఉత్తరాఖండ్‌లో ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన “సూర్య దేవ్ భూమి ఛాలెంజ్ 2.0” 113 కి.మీ హై ఎండ్యూరెన్స్ రన్‌లో విజయవంతంగా పాల్గొన్నారు. భద్రినాథ్ నుంచి కేదార్‌నాథ్ వరకు సాగిన ఈ కఠినమైన పరుగును పూర్తి చేసి తన ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా తనకు ప్రోత్సాహం అందించి, స్పాన్సర్ చేసిన జనగాం సీఐ సత్యనారాయణ రెడ్డి గారికి, పోలీస్ సిబ్బందికి నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. యువతకు నరేష్ ఆదర్శంగా నిలిచారు.

సంబంధిత పోస్ట్