కడియం శ్రీహరి రాజీనామా చేసి చూపించు: రాజేష్

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కారు గుర్తుపై గెలిచినందున ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని బిఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి రాజేష్ నాయక్ డిమాండ్ చేశారు. జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేటీఆర్ ను దేవుడితో సమానంగా కొలిచిన కడియం శ్రీహరి, కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించమని కడియం శ్రీహరి రాసిన రాతలకు ప్రతి గోడ రాజీనామా చేయాలని ప్రశ్నిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్