మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి: కేటీఆర్

మొక్కజొన్న కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. జనగామలో ఆయన మాట్లాడుతూ లక్షల ఎకరాల్లో పంట సాగైనా ప్రభుత్వం కొనుగోళ్లపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించలేదని మండిపడ్డారు. మద్దతు ధర విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించి రైతులకు అండగా నిలవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్