వరంగల్ జిల్లా, సంగెం మండలం మొండ్రాయి గ్రామంలోని కేకే ఫంక్షన్ హాల్ వద్ద, మొండ్రాయి, గొల్లపల్లి, బాలు నాయక్ తండ, ముమ్మిడివరం, వంజరపల్లి, తిమ్మాపురం గ్రామ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మించనున్న మహిళా సమైక్య భవనాలకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.